దొంగ ఓట్ల కోసం మూడు దశల్లో పోలింగా?ఇది ఎక్కడి విడ్డూరం..!

by Jakkula Mamatha |   ( Updated:2024-03-06 16:51:17.0  )
దొంగ ఓట్ల కోసం మూడు దశల్లో పోలింగా?ఇది ఎక్కడి విడ్డూరం..!
X

దిశ,నరసాపురం : రాష్ట్ర అసెంబ్లీకి రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.రెండు,మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే, దొంగ ఓట్లు వేయడం సులభతరం అవుతుందని ఆయన భావించి ఉంటారు. తమిళనాడు నుంచి కుప్పం కు అరువు జనాలు ,కోస్తాంధ్రకు, నెల్లూరు,ఒంగోలు ప్రాంతానికి రాయలసీమ బ్యాచ్ ను సులభంగా తరలించవచ్చు నని ఆయన ఉద్దేశమై ఉంటుందన్నారు . బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్ని ఓట్లు పడిన పడినట్లే లెక్క అని భావించి ఉంటారు. ఇటువంటి కుట్రలపై ఆధారపడే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో నెగ్గ వచ్చునని అనుకుంటున్నారు ఎద్దేవా చేశారు.టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కడితే ఈ రౌడీ వేషాలు వేయడానికి కుదరదని గుర్తుచేసారు. కూటమితో బీజేపీ పొత్తుల పర్వం రేపో, మాపో అనే స్థాయిలో ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గత రెండున్నర ఏళ్లు గా నేను చెబుతున్నా అన్నారు.రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో గెలువాలని భావిస్తున్నారని జనసేన, టీడీపీ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయి. పొత్తులపై చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి,ఇన్చార్జ్ మధుకర్జీ ఢిల్లీకి చేరుకోగా, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావచ్చన్నారు.

Read More..

Nara Lokesh : పుట్టపర్తి లో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

Advertisement

Next Story

Most Viewed