జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా?: నారా లోకేశ్

by Seetharam |
జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా?: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో విడుదలైన బహిరంగ లేఖపై రాజమహేంద్రవరం జైలు అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పేరుతో విడుదలైన లేఖ జైలు నుంచి వచ్చింది కాదని సూపరింటెండెంట్ రాహుల్ వెల్లడించారు. పోలీసుల రియాక్షన్‌పై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా? నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా?’ అని లోకేశ్ నిలదీశారు.‘చెయ్యని తప్పుకి 44 రోజులుగా జైలులో బంధించారు. ములాఖత్‌లో భాగంగా ఆయన ప్రజలతో చెప్పాలి అనుకున్న అంశాలు అన్ని మాతో పంచుకున్నారు. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరం అన్నట్టు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేయడం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోంది. నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్‌కి కక్ష తీరలేదు. ఆఖరికి ఆయనకు లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారు’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేశ్ దసరా శుభాకాంక్షలు

మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చెడుకి పోయేకాలం ద‌గ్గ‌ర ప‌డ‌టం ద‌స‌రా సందేశం అని అన్నారు. ప్ర‌జ‌ల్ని అష్ట‌క‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దాం అని సూచించారు. అదే మ‌న రాష్ట్రానికి అస‌లు సిస‌లు విజ‌యం తెచ్చే విజ‌య‌ద‌శ‌మి అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed