AP Political News: రానున్న ఏపీ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఇదేనా..?

by Indraja |   ( Updated:2024-03-07 12:22:44.0  )
AP Political News: రానున్న ఏపీ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఇదేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందా అని అటు రాజకీయవర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠత నెలకొంది. అయితే కొన్ని సర్వేల ఆధారంగా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందే అవకాశం ఎక్కువగావుందో అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అటు వైసీపీ ఇటు టీడీపీ పోటాపోటీగా తలపడుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా రానున్న ఎన్నికల్లో గెలుస్తామనే ఆశలు చిగురిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది.

దీనితో రానున్న ఎన్నికల్లో వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. ఈసారి 175కి 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా సర్వేల సమాచారం ప్రకారం రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచే సూచనలే లేవని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఇక వైఎస్ షర్మిల నేతృత్వంలో ఇప్పుఇప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం లేదని.. కాంగ్రెస్ కేవలం ఓట్లను చీలుస్తుంది అంతేగాని గెలిచే అవకాశం మాత్రం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీగా కాంగ్రెస్ కి ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అలానే జగన్ అధికారంలోకి వచ్చాక తమకు ఒరిగింది ఏమి లేదనే భవన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని.. అలానే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల్లోకి రావడానికి ఇష్టపడలేదు పరదాల మాటున తిరిగారు.. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అబద్దాలతో ఆకట్టుకోవాలని చూస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగురాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దాఖలాలే లేవు. ఇక అలానే బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో పొత్తు కలుపుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలకు ఉన్న ఒకేఒక ప్రత్యామ్నాయం టీడీపీ, లేదా జనసేన, ఈ రెండు పార్టీలు పొత్తు కలుపుకున్నాయి. అలానే టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా పార్టీకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పాదయాత్రలతో, బహిరంగ సభలతో ప్రజలకు దగ్గర అవుతున్నారని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయని.. కనుక రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకుల సమాచారం.

Read More..

ఎవ్వరినీ మర్చిపోను.. పోలీసులపై పవన్ హాట్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed