- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణంరాజు భార్య పొలిటికల్ ఎంట్రీ అప్పుడేనా..?
దిశ, వెబ్ డెస్క్: దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఇవ్వాళ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను శ్యామలాదేవి స్వయంగా చూసుకుంటున్నారు.
అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో ఆవిడ మాట్లాడుతూ.. కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆమె వివరించారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని ఆయన ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెప్పారు. జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. కాగా వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా కృష్ణంరాజు భార్య శ్యామలదేవి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.