నారావారిపల్లెలో అట్టహాసంగా సంక్రాంతి సంబురాలు.. హాజరైన చంద్రబాబు కుంటుంబ సభ్యులు

by Shiva |
నారావారిపల్లెలో అట్టహాసంగా సంక్రాంతి సంబురాలు.. హాజరైన చంద్రబాబు కుంటుంబ సభ్యులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అంతటా జనం సంక్రాంతి పండుగ సంబురాల్లో తడిసి ముద్దవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే పండుగ రోజు బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌, కంఠమనేని శ్రీనివాస్‌, లోకేశ్వరి, తదితరులు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను వసుంధర, తేజస్విని పరిశీలించి ఎంకికైన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

Advertisement

Next Story