అరకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ

by Javid Pasha |   ( Updated:2023-09-23 07:18:19.0  )
అరకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న అరకు అందాలను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. పచ్చదనం, జలపాతాలు, లోయలను చూసేందుకు రోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. ఆంధ్ర ఊటీగా పేరు తెచ్చుకున్న అరకు అందాలను చూస్తూ సరికొత్త అనుభూతిని పొందుతారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి చాలామంది అరకు టూర్‌కు వెళతారు.

అరకు టూర్‌కు వెళ్లాలనుకునేవారికి తాజాగా ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. తాజాగా ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు అరకు అందాలను చూపించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో అరకులోని పర్యాటక ప్రదేశాలను చూపించడంతో పాటు టిఫిన్, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. అలాగే సందర్శనా స్థలం దగ్గరకు వెళ్లడానికి ఏసీ బస్సు సదుపాయం కూడా కల్పిస్తోంది. విశాఖ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.45 గంటలకు అరకు చేరుకుంటుంది. అక్కడ పర్యాటక ప్రాంతాలు అన్నీ చూసిన అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో తీసుకొస్తారు. ఇక ట్రైన్‌లో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఛైర్‌కార్‌ను బట్టి ధరలు నిర్ణయించారు.

సెకండ్ క్లాస్ అయితే పెద్దలకు రూ.2130, పిల్లలకు రూ.1760గా నిర్ణయించారు. ఇక స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.2,385, చిన్నారులకు రూ.1915గా ఛార్జీ ఉంది. అలాగే ఛైర్‌కార్‌లో పెద్దలకు రూ.4,450, చిన్నారులకు రూ.4080గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed