- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు పిటీ వారెంట్లపై విచారణ: ఆ పిటిషన్ డిస్మిస్
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పీటీ వారెంట్ల పిటిషన్ వాదనలపై టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. దీంతో ఏసీబీ న్యాయమూర్తి పాస్ ఓవర్‌కు అనుమతినిచ్చారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ తదితర బెయిల్స్ విచారణలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో నెల రోజుల క్రితం పీటీ వారెంట్లు దాఖలు చేసింది. పీటీ వారెంట్లపై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.
రైట్ టు ఆడియన్స్ పిటిషన్ డిస్మిస్
విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. రైట్ టు ఆడియన్స్ కింద వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే వారి అభ్యర్థనను ఏసీబీ కోర్టు న్యాయస్థానం తిరస్కరించింది. రైట్ టు ఆడియన్స్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, జరిగిన పరిణామాలను ఏసీబీ కోర్టు జడ్జికి ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు వివరించారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంటుపై వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబుకు కాస్త ఊరట దక్కిన విషయం తెలిసిందే.