- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Purandeswari : ఈ బాధ్యత బంధం కోసమేనా ?
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించడం పట్ల ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య సత్సంబంధాలు లేవు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావులు టీడీపీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. వైసీపీని అంతగా విమర్శించిన దాఖలాలు లేవు. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ బీజేపీగా రాజకీయం మారిపోయింది. అయితే ఇటీవలే చంద్రబాబు నాయుడు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాలు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పొత్తులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నిలకు మూడు నెలల ముందు పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ, బీజేపీల మధ్య సఖ్యత నెలకొనాలంటే చంద్రబాబుకు బంధువు, వివాదరహితురాలిగా పేర్గాంచిన పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచిదని హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది.
Read more : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి