- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Assembly: ‘వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పనులపై విచారణ చేపట్టాలి’..అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే?
దిశ,పర్చూరు:గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని, యువ నేత మంత్రి నారా లోకేష్ విద్యా శాఖను ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకాన్ని ప్రచారార్బటానికి వాడుకున్నారని ధ్వజమెత్తారు. పేదల కోసం ఈ ప్రాజెక్టును రూపొందించామని గొప్పలు చెప్పారని మండిపడ్డారు. వాస్తవానికి ఈ పథకానికి 2014 -2019 మధ్య ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలని ముఖ్యంగా పేద బడుగు బలహీన ముస్లిం మైనారిటీల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో అన్ని వసతులు ఉండాలని (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 4800 కోట్ల రూపాయలతో వెచ్చించి అన్ని పాఠశాలల్లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అధికారులను భాగస్వామ్యం చేసి పనులు చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో పనులు జరుగుతున్న సమయంలో 2019లో ప్రభుత్వం మారింది.
తర్వాత ఆ సభలో జగన్మోహన్ రెడ్డి చాలా ప్రగల్భాలు పలికారు, మూడేళ్లలో రాష్ట్రంలో ఉన్న పాఠశాలల పరిస్థితులు మారుస్తామని చెప్పి ఈ పథకాన్ని నాడు నేడు అని పేరు పెట్టి ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు అందవలసిన వస్తువుల్లో కూడా కక్కుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఇలాంటి పనులన్నీ చేయించి వారిని మానసికంగా వేధించారన్నారు.
తల్లిదండ్రులను ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలను కాంట్రాక్టర్ అవతార మెత్తెలా తయారు చేశారన్నారు. ఒక పవిత్రంగా జరగాల్సిన కార్యక్రమాన్ని డబ్బు ఆశకు కక్కుర్తి పడి బలి చేశారని అందుకే ఆ కార్యక్రమం సక్సెస్ కాలేదన్నారు. నియోజకవర్గంలో పాటు ఇతర ప్రాంతాల్లో నిధులు వెచ్చించి బాగు చేశారో ఆ పాఠశాలను తర్వాత ఏడాది ఆ పాఠశాలను రద్దు చేశారన్నారు. ఇది చాలా దుర్మార్గమని కేవలం అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం కోసమే పథకాన్ని వాడారని మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాక మంత్రిగా ఉన్న ఆయన విద్యాశాఖను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను నిర్మాణం చేసే దానికి పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు.
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన వసతులను కల్పించి మెరుగైన విద్యను అందించేలా మహా యజ్ఞానికి ఆనాడు చంద్రబాబు మొదలుపెట్టారని, ఈనాడు లోకేష్ బాబు పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వంలో పీఎసీ చైర్మన్ ఆ ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ అక్రమాలు అన్యాయాలు నిలదీస్తూ గళమెత్తారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో చొరవ తీసుకొని గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలన్నారు. ఐదేళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసంపై శ్వేత పత్రం తో పాటు సభలో కూడా చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సాంబశివరావు పేర్కొన్నారు.