- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేవాలయంలో వైసీపీ ఎంపీ జన్మదిన వేడుకలు.. వివాదాస్పదంగా మారిన అధికారుల తీరు
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల దేవాలయంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. యథేచ్చగా కొండపై వైసీపీ జెండాలతో నేతలు ర్యాలీ చేపట్టారు. అంతేకాకుండా కొండపై అడ్డూఅదుపు లేకుండా వైసీపీ నేతలు కేక్ కటింగ్‌లు చేశారు. వైసీపీకి చెందిన టీ షర్ట్‌లు ధరించి ఆలయంలోకి వచ్చారు.
ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా 10 వేల మంది వైసీపీ కార్యకర్తలకు దేవస్థానంలో భోజనాలు పెట్టారు. రూ.లక్ష అద్దె ఇచ్చే దేవస్థానం కల్యాణమండపంలో ఉచితంగా భోజనాలు పెట్టడంపై వివాదం చెలరేగుతోంది. అన్నదానం సిబ్బందితో భోజనాలు వడ్డించడం, దేవస్థానం స్టాఫ్‌తో వడ్డించడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరుతో ద్వారకాతిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
Advertisement
Next Story