- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖకు రాజధాని తరలింపు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖకి రాజధాని తరలింపు పిటిషన్పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని..విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనాపరంగా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వమే ఆలోచించుకోవాలని సూచించారు. ఈ అంశంపై ఒకవేళ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందుకు ఏజీ సైతం అంగీకారం తెలిపారు. అయితే ఈలోగా కార్యాలయాలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందువల్ల మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ హైకోర్టుకు తెలియజేశారు.అయితే కార్యాలయాల తరలింపుపై ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ఏజీ హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇలానే చెప్పి మళ్లీ తిరిగి కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తోందని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వైపు నుంచి రాజధానిని తరలించకుండా ఆదేశాలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.ఇరువాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.