- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే: భువనేశ్వరి యాత్రపై కొడాలి నాని సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీమంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నారా లోకేశ్ రాజకీయాల్లో అసమర్థుడు అని విరుచుకుపడ్డారు. లోకేశ్ సమర్థవంతమైన నాయకుడు అయితే టీడీపీకి ఈ పరిస్థితి ఎందుకు దాపరిస్తుందని అన్నారు. టీడీపీ నాశనమవ్వడానికి ప్రధాన కారణం నారా లోకేశ్ అని కొడాలి నాని ధ్వజమెత్తారు. మరోవైపు నారా భువేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి బస్సు యాత్రపై కొడాలి నాని సెటైర్లు వేశారు. కొంచెం లేట్ అయినా నిజమే గెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ లాయర్లకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజం గెలవాలనే కోరిక తీరితే చంద్రబాబు జీవితం జైల్లోనే ఉంటారని చెప్పుకొచ్చారు.నారా లోకేశ్ అసమర్థుడు కాబట్టే భువనేశ్వరి రోడ్డుమీదకు వచ్చారు అని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు.
జనసేనకాదు జనసున్నా
2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగానే ఉన్నారని మాజీమంత్రి కొడాలి నాని ఆరోపించారు. ప్రస్తుతం ఆ ముసుగు తొలగిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. అది జనసేన పార్టీ కాదని... జనసున్నా పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ పప్పు అనే నారా భువనేశ్వరి రోడ్డెక్కడంతో అందరికీ అర్థమైందని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు.