- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజల్లోకి రాకుంటే కోటరీ వదలదు, కోటా మిగలదు.. మాజీ ఎంపీ సంచలన ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్సీపీకి (YSRCP) రాజీనామా (Resign) చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Former MP Viajyasai Reddy) కొద్ది రోజుల క్రితం ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీరు వల్లే తాను పార్టీని వీడి బయటికి వచ్చానని, ఆయన చుట్టూ ఉన్న కోటరీ (Kotary) వల్లే జగన్ నష్టపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఆయన కోటరీని దూరం పెడితేనే బాగు పడతారని, పార్టీని వీడినా ఆయన బాగునే కోరుకుంటానని అన్నారు. దీనిపై వైసీపీ నేతలు (YCP Leaders) స్పందిస్తూ.. విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చుట్టూ కోటరీ లాంటివి ఏమి లేవని, విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆయనకే మంచిదని హెచ్చరించారు.
అంతేగాక పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు పార్టీపై బురద జల్లడం కామన్ అని, దానికి విజయసాయిరెడ్డి అతీతులు కారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు. కోటరీ గురించి స్టోరీ చెబుతూ.. ప్రజల్లోకి రాకుంటే కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన.. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారని, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని తెలిపారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదని అన్నారు. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని చెప్పారు.
కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని, వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడని తెలిపారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! అని, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలని సూచించారు. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! అంటూ.. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. కాగా వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి కొద్ది రోజుల క్రితం తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.