- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ అధికారంలోకి వస్తే 20లక్షల ఉద్యోగాలు భర్తీ : Chandrababu Naidu
దిశ, డైనమిక్ బ్యూరో : నాలుగేళ్ల వైసీపీ పాలనలో అన్యాయాలు అక్రమాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారయ్యాడని ధ్వజమెత్తారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానని..ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై ‘యుద్దభేరి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు నందికొట్కూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడు అయినప్పటికీ ఈ ప్రాంతం గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బటన్ నొక్కుతున్నా అని పదేపదే చెబుతున్న వైఎస్ జగన్ బటన్ నొక్కుడు వెనుక బొక్కుడు కూడా ఉందన్నారు. ఈ వైసీపీ పాలనలో బటన్ నొక్కడం కాదు.. బటన్ బొక్కుడు ఎక్కువైంది అని ధ్వజమెత్తారు. ఈ వైసీపీ పాలనలో సామాన్యుడు దగ్గర నుంచి బిజినెస్ మేన్‌ల వరకు అంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నారని...ఇప్పటికి 8 సార్లు పెంచారని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన విద్యుత్ పాలసీ తీసుకొస్తాం అని... విద్యుత్ చార్జీలు తగ్గించే బాధ్యత తీసుకుంటాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ముచ్చుమర్రి ప్రాజెక్టు సందర్శన
తెలుగుదేశం పార్టీ శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో ముందుచూపుతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులను ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించి ఎంత కష్టమైనా ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా ఒక్క మంచి పనిచేశారా? అని నిలదీశారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.12,400 కోట్లు ఖర్చు పెడితే... సీమ ద్రోహి జగన్ ఖర్చు చేసింది రూ.2వేల కోట్లేనని ఆధారాలతో సహా వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానని చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కర్నూలు పర్యటనలో భాగంగా ముచ్చుమర్రి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.549కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఈ ముచ్చుమర్రికి కేవలం రూ.5కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ, కాల్వల మరమ్మత్తులకు కూడా కనీసం సీఎం జగన్ నిధులు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాబు రావాలంటే బాబు రావాల్సిందే
మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ మూడు రాజధానులు కడతారట అని మండిపడ్డారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు సరికదా ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలని అంతేకానీ పరదాల మాటున దాక్కుని కాదని ఎద్దేవా చేశారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప రాజకీయలకు న్యాయం జరగదని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరించారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. యువగళం పాదయాత్రతో యువతలో చైతన్యం వచ్చిందన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందేనని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
Read More : యువత ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత.. సీఎం జగన్