Viral News: మార్కులు వేయకపోతే చేతబడి

by Anjali |   ( Updated:2024-04-10 07:04:04.0  )
Viral News: మార్కులు వేయకపోతే చేతబడి
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశారు. 'నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాశారు. కాగా ఆ పేపర్ దిద్దుతున్న టీచర్ ఆ సమాధానం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆన్సర్ షీట్ ను ఉన్నతాధికారులకు చూపించారు. కాగా ఆ విద్యార్థికి 70 మార్కులు వచ్చాయి.

Advertisement

Next Story