- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు వద్ద.. నేర్చుకోవాలనే తపన నాకుంది.! పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి గురించి రాజకీయాలకు అతీతంగా ఆలోచించామని, గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గ్రామాలన్నింటిని స్వర్ణ గ్రామాలుగా చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. గ్రామాలు ఎప్పుడూ పచ్చగా ఉంటేనే, మనమంతా హాయిగా జీవిస్తామని అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లెలో 'స్వర్ణ గ్రామ పంచాయతీ' పేరుతో నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు.
అయితే... "గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించిన పరిస్థితిని మనం చూసామని అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిందని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీలకు జీవం పోస్తే, రాష్ట్ర అప్పులన్నీ తీర్చే అవకాశం ఉంటుందని అన్నారు. మాకు ఉన్న ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి.. నిరంతరం బాధ్యతగా పనిచేస్తామని, అయితే బాధ్యతల నుంచి తాము పారిపోమని పవన్ అన్నారు. ఉన్నపళంగా అద్భుతాలు చేయడానికి మా చేతిలో మంత్రదండం ఏమీలేదు కానీ గుండెల నిండా నిబద్దత ఉందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఇప్పటికే చాలా సభల్లో చెప్పాను. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేది మాత్రం చంద్రబాబేనని, ఆయన లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారని వెల్లడించారు. అయితే నాకన్నా బాగా ఆలోచించగలిగే వాళ్ల వెంట నడిచేందుకు తానేమి సంకోచించనని, పాలనానుభవం ఉన్న చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలనే తపన నాకు ఉంది" అని గ్రామ బహిరంగ సభలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.