చంద్రబాబు ఆరోగ్యంపై హైడ్రామా టీడీపీ సింపతీ గేమ్: అంబటి రాంబాబు

by Seetharam |
చంద్రబాబు ఆరోగ్యంపై హైడ్రామా టీడీపీ సింపతీ గేమ్: అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబుకి ప్రాణాపాయం ఉందని.. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే నోటికొచ్చిన అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశంతో క్రూరంగా చంద్రబాబు ఆహారంలో స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారని ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఆహారం పంపుతోంది ఆయన కుటుంబ సభ్యులే. దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని విషపూరిత ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా.. ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. టీడీపీలో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్‌ అని చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఇంకా తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని యనమల ఎలా చెప్తారని మంత్రి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ న్యాయస్థానంలోనూ రిలీఫ్‌ రాలేదు...స్కామ్‌ల డబ్బు కూడా వచ్చి టీడీపీ ఖాతాల్లో పడ్డాయి అని ఆధారాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. తన పలుకుబడితో సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సలహా మేరకు పీఏ శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటానికి ఈరోజు వరకు కోర్టుల నుంచి సుముఖత వ్యక్తం కాలేదు అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

చట్టం ముందు అంతా సమానమే

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో పోలీసులకు ఏ మాత్రం సంబంధం లేదు అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావాలి. చంద్రబాబుకు చల్లటి వాతావరణం కావాలని అంటున్నారు. దీనికి లోకేశ్‌ జైలు సూపరిటెండెంట్‌ను అడిగితే.. ఆయన ఏసీ పెడితే జైలు అధికారుల ఉద్యోగం పోతుంది అని చెప్పుకొచ్చారు. కోర్టు ఆదేశిస్తేనే ఏసీ పెట్టాలి. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదు. చంద్రబాబుకు ఏమైనా జైలుకు వచ్చిన తర్వాత చర్మవ్యాధి వచ్చిందా.. అంతకు ముందే ఉందా?. రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. దీనికి చంద్రబాబు కుటుంబం సమాధానం చెప్పాలి. దీనిపై నేను ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన తర్వాత ఏసీ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు అని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబే కాదు.. తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మధు కోడా, శిబు సోరేన్, జయలలిత, యడ్యూరప్ప, ఓం ప్రకాశ్ చౌతాలా, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది. చంద్రబాబు విషయంలోనూ అంతే జరిగింది’ అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.


పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలు...?

పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురాలో చెప్పాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కుమార్తెగా ఉండి, అధికారం ఉన్న పార్టీలలో చొరబడడం, చంద్రబాబును కాపాడటం ఆమెకు అలవాటు అయిపోయిందన్నారు. ఇది బీజేపీకి కూడా మంచిది కాదు. కేంద్ర హోంమంత్రి దగ్గరకు లోకేశ్‌ను తీసుకెళ్లారు. నిజాలు తెలుసుకునే కేంద్రం కూడా మౌనంగా ఉండిపోయింది. ఇదే కేసులో ఈడీ నలుగురిని అరెస్టు చేసింది. ఈ విషయం పురంధేశ్వరి తెలుసుకోవాలి అని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

Advertisement

Next Story