మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు బారులు తీరిన బాధితులు

by Mahesh |
మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు బారులు తీరిన బాధితులు
X

దిశ, ప్రతినిధి గుంటూరు: ఉండవల్లి నివాసం లో మంత్రి నారా లోకేశ్ 52వరోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది భూ బాధితులే ఉన్నారు. మళ్లీ మళ్లీ తనను బాధితులు కలవకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాలని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు. నరసరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పుచేయాలంటూ ప్రభావిత ప్రజలతో కలిసి ఎమ్మెల్యే అరవిందబాబుతో లోకేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే, పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బద్వేలు కి చెందిన ఎల్.కొండమ్మ విన్నవించింది.

మా స్థలం దురాక్రమణకు యత్నం..

వైసీపీ నేతల అండతో ఓ వ్యక్తి విశాఖలోని తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గం మోపర్రు కు చెందిన కృష్ణ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు. కర్నాటకలో మెడిసిన్ చదువుతూ అదృశ్యమైన తమ బిడ్డ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి విన్నవించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వీకరించిన మంత్రి లోకేశ్.. ధైర్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed