ఏపీలో భారీగా పోలింగ్ పర్సంటేజ్.. ఇప్పటి వరకూ ఎంతంటే..?

by srinivas |   ( Updated:2024-05-13 13:30:06.0  )
ఏపీలో భారీగా పోలింగ్ పర్సంటేజ్.. ఇప్పటి వరకూ ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ గంట గంటకు ఓటింగ్ శాతం పెరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అర్బన్‌లో కంటే రూరల్‌లో మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చి ఓటు వేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.20 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో సాయంత్రం వరకూ భారీగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల ఎర్రటి ఎండలోనూ భారీగా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Read More..

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

Advertisement

Next Story

Most Viewed