ఎన్నికల ఫలితాల వేళ.. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలింపు

by srinivas |   ( Updated:2024-05-21 09:48:30.0  )
ఎన్నికల ఫలితాల వేళ.. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయంలో ఏపీకి తెలంగాణ నుంచి భారీగా డబ్బు తరలివెళ్లింది. అయితే ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ. 68 లక్షల నగదును పట్టుకున్నారు. ఏపీలో ఓ పార్టీకి చెందిన నేత నగదుగా గుర్తించారు.

అయితే నగదుకు సంబంధించి ఎలాంటి అధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు నగదును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో పార్టీల గెలుపుపై బెట్టింగులు జరుగుతున్న నేపథ్యంలో ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో NIA దాడుల కలకలం

Advertisement

Next Story