Big Breaking: ఆ జిల్లాలో భారీ బంగారం పట్టివేత.. ఎన్ని కేజీలంటే..?

by Indraja |
Big Breaking: ఆ జిల్లాలో భారీ బంగారం పట్టివేత.. ఎన్ని కేజీలంటే..?
X

దిశ,కాకినాడ జిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కాకినాడ జిల్లాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో పోలీసులు నిర్వహించిన తణిఖీల్లో 8కేజీల బంగారం, 46కేజీల వెండిని పోలీసులు వెండి స్వాధీనం చేసుకున్నారు.

పెద్దాపురం సీఐ రవికుమార్‌కు అందిన సమాచారం మేరకు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి పర్యవేక్షణలో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో బీవీసీ లాజిస్టిక్స్ వాహనం నుండి అనుమతులు లేని రూ. 5.60 కోట్ల విలువ చేసే బంగారం, వెండిని శుక్రవారం నిర్వహించిన తణిఖీల్లో పట్టుకున్నారు. పెద్దాపురం ఆర్డీవో సమక్షంలో వెండి, బంగారాన్ని అధికారులు సీజ్ చేసారు. ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story