Breaking: ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలకు భారీగా ఎక్స్ గ్రేషియా

by srinivas |
Breaking: ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలకు భారీగా ఎక్స్ గ్రేషియా
X

దిశ, వెబ్ డెస్క్: అనకాలపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మ కంపెనీలో పెను ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలి 17 మంది కార్మికులు చనిపోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలుడు ధాటికి గోడ, స్లాబ్ కూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అచ్యుతాపురం వెళ్లనున్నారు. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.కోటి చొప్పున కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. 41 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి సైతం పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story