ఏపీలో ‘పుష్ప’ సీన్ రిపీట్.. యాక్సిడెంట్ కావడంతో బాగోతం బట్ట బయలు

by Satheesh |
ఏపీలో ‘పుష్ప’ సీన్ రిపీట్.. యాక్సిడెంట్ కావడంతో బాగోతం బట్ట బయలు
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసుల కల్లు గప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లుగా.. కొందరు డబ్బులను అదే స్టైల్లో తరలించాలని చూసి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలోని అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో తవుడు బస్తాలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. అయితే, ఈ వాహనంలో తవుడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా.. ఊహించని విధంగా తవుడు బస్తాల మధ్యలో అట్ట పెట్టెల్లో పెట్టి తరలిస్తోన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి.

7 పెట్టెల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి ఒక్కసారిగా ఖంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టాస్ ఏస్ వాహనంలో బయటపడ్డ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐటీ ఆఫీసర్స్ నగదును లెక్కించే పనిలో పడ్డారు. కాగా, పట్టుబడిన నగదు ఎవరది, ఎంత అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed