- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్ సెగ్మెంట్లపై నేతల ఆశలు.. ఆ ఐదు నియోజకవర్గాల్లో ఉత్కంఠ
దిశ, కర్నూలు ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటనపై దూకుడు పెంచారు. మొదటి దఫాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించగా మిగతా అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నారు. సీటు రాని నేతలంతా రెండో జాబితాలో తమ పేర్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి లిస్టు ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తినా వాటిని అధిగమిస్తూ అలక నేతలకు భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. రెండో జాబితాలో ఎవరెవరి పేర్లుంటాయోనన్న టెన్షన్ నేతల్లో మొదలైంది. మరోవైపు బీజేపీతో పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈసారి అధినేత మాజీ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో సీట్ల ప్రకటనతో అలజడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా అందులో 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మిగిలిన ఐదు సెగ్మెంట్లైన నందికొట్కూరు, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ వెంకటస్వామి, గిత్త జయసూర్యలు ఎవరికి వారుగా టికెట్ల ప్రయత్నాలు, కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ మధ్య కాలంలో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి మిడ్తూరులో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో జయసూర్యను ఇంచార్జిగా ప్రకటించారు. కానీ అది అధికార ప్రకటన కాకపోవడంతో నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈయన టీడీపీలో చేరతారనే వార్తలు విన్పిస్తున్నాయి. మంత్రాలయంలో ఇంచార్జిగా కొనసాగుతున్న తిక్కారెడ్డికి కూడా ఈ సారి సీటు కష్టమనే సంకేతాలు విన్పిస్తున్నాయి. ఆయనకు కాకుండా ఈసారి ఆదోని మాజీ ఇంచార్జి గుడిసె కృష్ణమ్మకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
మాజీ ఎమ్మెల్యేలకు నిరాశే..
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అభ్యర్థుల ప్రకటనలో మాజీ ఎమ్మెల్యేలకు నిరాశను మిగిల్చారు. ఉమ్మడి జిల్లాలోని ఆలూరు ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, ఆదోని ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మిగనూరు ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిలకు ఈ సారి టికెట్ లేదనే సంకేతాలు విన్పిస్తున్నాయి. కోట్ల కుటుంబానికి డోన్ టికెట్‌ను కేటాయించడంతో ఆలూరు సీటును వైకుంఠం ఫ్యామిలీకి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అదే క్రమంలో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు సీటు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఆదోనిలో మీనాక్షి నాయుడుకు బదులు భాస్కర్ రెడ్డిని బరిలో దింపే అవకాశాలున్నాయి. ఇక మొదటి నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి బీసీల సెగ తగిలింది. అక్కడ వైసీపీ బీసీ సామాజిక తరగతికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు కేటాయించడంతో ఆ స్థానాన్ని టీడీపీ కూడా అదే సామాజిక తరగతికి చెందిన మాచాని సోమనాథ్ కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీతో పొత్తు కుదిరితే మాత్రం పొత్తులో భాగంగా మురహరి రెడ్డికి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read More..
నాగబాబు సీటు చేంజ్.. ఈ సారి పోటీ ఆ పార్లమెంట్ స్థానం నుండే..?