- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Homeopathic liquor: విశాఖలో హోమియోపతి మద్యం..
విశాఖ పట్నం: రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతోంది. కొందరు వ్యక్తులు ప్రజల ఆరోగ్యం పైన వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు మాకు పైసలు కావాలి అని అనుకుంటున్నారు. అందుకు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ప్రాణాలను నిలబెట్టే మందులతో పాటు ప్రాణాలను తీసే మద్యాన్ని కూడా తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తి లోని అపార్ట్మెంట్‌లో షిరీష అనే మహిళ తన భర్తతో కలిసి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కాగా ఈ జంట విశాఖపట్నం నుంచి వలస వచ్చింది. ఈ నేపథ్యంలో డబ్బులు సంపాదించుకునేందుకు కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు.
మైగ్రేన్ వ్యాధి నివారణకు ఉపయోగించే బెల్లడోనా అనే ద్రావణాన్ని ఉపయోగించి మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. బెల్లడోనా అనేది చాలా శక్తివంతమైన మెడిసిన్. దీన్ని పలురకాల వ్యాధుల నివారణకు ఔషదంగా ఉపయోగిస్తారు. అయితే ఆ భార్యభర్తలు బెల్లడోనా ద్రావణాన్ని కార్బో వెజిటబుల్, అస్పిడోస్పెర్మా లాంటి ద్రావకాలతో కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.
ఈ మద్యాన్ని క్వార్టర్ కాదు, అందులో సగం తాగినా చాలు కిక్కిస్తుంది, ఆ వెంటనే ఆరోగ్యం పాడవుతుందని సమాచారం. అయితే గుట్టుచప్పుడు కాకుండా దందా నడుపుతున్న ఆ భార్యభర్తలు గుట్టును విశాఖ పోలీసులు కనిపెట్టారు. అక్రమంగా తయారుచేసిన 775 మద్యం బాటిళ్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఈ దందాలో శిరీషను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాటిని విక్రయిస్తున్న ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read More..