- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Twitter War: విజయసాయిరెడ్డి విమర్శలకు హోంమంత్రి స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ రాద్దాంతం చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎక్స్ వేదికగా హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో రాజీనామా ఎవరు చేయాలో కాలమే నిర్ణయిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ఎన్డీయే ప్రభుత్వమని, డీఎన్ఏ ప్రభుత్వం కాదని చెప్పారు. ప్రజలు బానే ఉన్నారని, దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్మీట్లు, ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారని వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
కాగా ట్విట్టర్‌లో అంతుకుముందు రాష్ట్ర హోంమంత్రి అనితపై విజయిసాయిరెడ్డి విమర్శలు చేశారు. ‘‘హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి.’’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్‌పై హోంమంత్రి వంగపూడి అనిత ధీటుగా జవాబిచ్చారు.