- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు’.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రి పై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్‌మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజు నుంచి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అని అన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్ట చర్యలు తీసుకున్నామని ఆమె అన్నారు. కొండ దిగువ నుంచి పై వరకు ఉన్న భక్తుల క్యూ లైన్ లను పరిశీలించుకుంటూ భక్తులకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నానని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆమె అన్నారు.
శరన్నవరాత్రులలో అత్యంత విశేషమైన మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీని నియంత్రించేందుకు గాను తాము ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె అన్నారు. క్యూలైన్‌లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా జరుగుతుందని భక్తులు తమతో స్వయంగా అనడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె అన్నారు. తాను కూడా సామాన్య భక్తురాలు వలె అంతరాలయంలోనికి వెళ్లకుండా సాధారణ దర్శనం చేసుకున్నానని ఆమె తెలిపారు. నేడు రికార్డు స్థాయిలో ఉదయం 11 గంటల వరకు 54,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో విశేషమని ఆమె అన్నారు. సామాన్య రోజులలో తాగునీరు మజ్జిగ పాలు వంటి అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఎక్కడా ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించామని ఆమె అన్నారు.