Tirumala: తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.54 వేలు జీతం

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-12 11:19:28.0  )
Tirumala: తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.54 వేలు జీతం
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు టీటీడీ శుభవార్త తెలిపింది. శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గోశాల మేనేజర తో పాటు డెయిరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గోశాల మేనేజర్ పోస్టులు 3 .. డెయిరీ అసిస్టెంట్ 6 పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనున్నారు.

-మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపిక వారికి వేతనం నెలకు రూ.54,060 చెల్లిస్తారు.

-ఇక డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి, రెండేళ్ల యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,980 నుంచి 54,060 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆఫ్ లైన్ లోనే మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తులను ది డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర కౌ ప్రొటెక్షన్ ట్రస్ట్, టీటీడీ, చంద్రగిరి రోడ్, తిరుపతి-517502, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కు పంపాలి. ఏప్రిల్ 11 దరఖాస్తుకు చివరితేదీ.

Advertisement

Next Story