పెనుగంచిప్రోలు తిరునాళ్లలో ఘర్షణ.. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన వాతావరణం

by Mahesh |   ( Updated:2025-03-18 04:48:43.0  )
పెనుగంచిప్రోలు తిరునాళ్లలో ఘర్షణ.. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుణాళ్లలో (Penuganchiprol Thirunallu) సోమవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాళ్లలో టీడీపీ, జనసేన, వైసీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో ప్రభల ఊరేగింపు చేశారు. అయితే టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకు చెందిన ప్రభల ఊరేగింపు ఒకే చోటు ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో టీడీపీ(TDP)కి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా.. వైసీపీ(YCP) కి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతల మధ్య వాగ్వాదం నెలకొని.. తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ నేతలో ఇతర ప్రభల ఊరేగింపు చేస్తున్న వారిపై వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరారు.

దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు (police) రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో దాడులు అడ్డుకున్న నలుగురు పోలీసులకు, స్థానికులకు స్వల్పగాయాలయ్యాయి. ఇరు పార్టీల నేతలకు పోలీసులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే కాకుండా.. అడ్డుకున్న పోలీసులపై దాడులు చేసిన వ్యక్తులను వీడియోల ద్వారా గుర్తించిన పోలీసులు వారంతా వైసీపీ కార్యకర్తలు (YCP activists)గా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. అలాగే మరికొందరు ఇతర పార్టీ నేతలపై కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. రాత్రి ఈ ఘర్షణ చోటు చేసుకొగా.. ఈ రోజు పెనుగంచిప్రోలులో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎవరైన గుంపులుగా తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Next Story

Most Viewed