AP Politics: టీడీపీ Vs వైసీపీ.. ఒంగోలు రిమ్స్ వద్ద హై టెన్షన్..!

by Indraja |   ( Updated:2024-04-12 12:55:12.0  )
AP Politics: టీడీపీ Vs వైసీపీ.. ఒంగోలు రిమ్స్ వద్ద హై టెన్షన్..!
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. తాజాగా ఒంగోలులోని ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కాగా ఈ ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఒంగోలులోని రిమ్స్‌లో జాయిన్ చేశారు. కాగా వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ బాధితులను పరామర్శించడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రిమ్స్ వద్దకు చేరుకున్నారు.

అలానే టీడీపీ దాడిలో గాయపడిన వైసీపీ బాధితులను పరామర్శించడానికి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా రిమ్స్ వద్దకు చేరుకున్నారు. దీనితో ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

దీనితో ఆసుపత్రి చుట్టూ భారీగా పోలీసులు మొహరించారు. అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు కూడా రిమ్స్ వద్దకు చేరుకున్నారు. కాగా బీఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చాయి.

Advertisement

Next Story