Balakrishna: నారావారిపల్లెలో హీరో బాలకృష్ణ సందడి

by GSrikanth |   ( Updated:2023-01-14 07:55:33.0  )
Balakrishna: నారావారిపల్లెలో హీరో బాలకృష్ణ సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రనటుడు, హీరో నందమూరి బాలకృష్ణ నారావారిపల్లెలో సందడి చేశారు. శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. వేకువ జామునే రోడ్లపై రన్నింగ్ చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేసిన భోగి మంటలలో చలి కాచుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గదని.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని బాలకృష్ణ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.

Advertisement

Next Story