- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaravati: భారీ వరదలు.. రాజధాని అమరావతి పరిస్థితిపై మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు నెల చివరి వారం తో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీలో భారీ వర్షాలు కురిశాయి దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అమరావతి మొత్తం నీటిలో మునిగిపోయిందని.. రాజధాని చెరువును తలిపిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరదలు పూర్తిగా తగ్గాయి. ఇప్పుడిప్పుడే వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు.
బుడమేరు వాగు కట్టకు గండి పడిన ప్రదేశాలను తిరిగి.. ఏ విధంగా గండ్లను పూడ్చారు అని పరిశీలించారు. అలాగే రాజధాని అమరావతిలో కూడా మంత్రి పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదు. అనవసర ప్రచారం నమ్మవద్దని.. బుడమేరు వల్ల కూడా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది ఉండదన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి చాలా సురక్షితంగా ఉందని, భవిష్యత్‌లో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండే ప్లాన్ చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
- Tags
- amaravati