పోలవరం వద్ద గోదావరి ఉధృతి.. భారీగా నీరు విడుదల

by srinivas |   ( Updated:2024-08-03 04:34:55.0  )
పోలవరం వద్ద గోదావరి ఉధృతి..  భారీగా నీరు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురిసిన వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పోలవరం వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ మేరకు పోలవరం స్పిల్ వే వద్ద 31.290 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. స్పిల్ వే దిగువన గోదావరి నీటిమట్టం 22.595 మీటర్లుగా కొనసాగుతోంది. మొత్తం 7, 16, 051 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలని ప్రాజెక్టు అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. మరోవైపు గోదావరి పరివాహంలోని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. నిత్యావసరాల కోసం పడవలపై ప్రయాణం చేస్తున్నారు. వర్షాల దెబ్బకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Advertisement

Next Story