- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu bail petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ వాదనలు వినాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కోరారు. శనివారం వాదనలు వినాలని న్యాయవాదులు ఏసీబీ కోర్టు జడ్జిని కోరారు. అయితే వాదనలు వినేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. కస్టడీలో విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సరికాదని అభిప్రాయపడింది. సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.
ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు కస్టడీకి ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. 140 మంది సాక్షులను విచారిచి 4000 డాక్యుమెంట్లను సీఐడీ సేకరించి వాటిపై దర్యాప్తు చేస్తున్నందున తాము ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది.స్కిల్ స్కామ్ కేసులో అక్రమార్జనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. కేసు విచారణను పారదర్శకంగా జరగాలి.
అందుకే క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నాం’ అని ఏపీ హైకోర్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. హైకోర్టు తీర్పు కాపీని సైతం పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. స్కిల్ స్కామ్ కేసులో కుట్ర దాగి ఉందని.. నగదు ఎక్కడ నుంచి ఎక్కడకు ఎలా వెళ్లాయో సమాచారం తమ దగ్గర ఉందని ఈ నేపథ్యంలో విచారించేందుకు చంద్రబాబు నాయుడును రిమాండ్‌కు ఇవ్వాలన్న సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీ భవించారు. ఈ మేరకు రెండు రోజులపాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Read More :
బిగ్ బ్రేకింగ్: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఒక్కరోజే మూడు వరుస ఎదురుదెబ్బలు