Chandrababu Naidu : ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్ల విచారణ : లంచ్ తర్వాత నిర్ణయం

by Seetharam |   ( Updated:2023-09-19 07:58:01.0  )
Chandrababu Naidu : ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్ల విచారణ : లంచ్ తర్వాత నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించిన మూడు పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై టీడీపీ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు నిర్ణయం వచ్చేవరకు కస్టడీ పిటిషన్‍పై ఎటువంటి ప్రక్రియ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదుల దాఖలు చేసిన మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లపై సీఐడీ తరఫు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేయలేదు. దీంతో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. దీంతో న్యాయమూర్తి పిటిషన్లను పక్కన పెట్టారు. లంచ్ తరువాత హైకోర్టు నిర్ణయం మేరకు విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More..

స్కిల్ స్కామ్ కేసు : రంగంలోకి సుప్రీంకోర్టు న్యాయవాదులు

Advertisement

Next Story

Most Viewed