సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణకు.. సీజేఐ రియాక్షన్ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-09-27 11:20:06.0  )
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణకు.. సీజేఐ రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఈ కేసును సీజేఐ ధర్మాసనం విచారించింది. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపు నాయ్యవాదులు సీజేఐ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు. అంతకు ముందు విచారణ చేపట్టేందుకు జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపారు. దీంతో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ఈ కేసును ప్రస్తావించారు. దీంతో ఈ కేసును విచారణకు స్వీకరించారు.

దీంతో సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మీకేం కావాలని సీజేఐ చంద్రబాబు లాయర్ లూథ్రాను ప్రశ్నించారు. ఇవాళ లిస్ట్ అయినా కేసు తీసుకోలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, 17ఏ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయలేదని వాదనలు వినిపించారు. అక్టోబర్ 3న మరో బెంచ్ ముందుకు లిస్ట్ చేస్తామని సీజేఐ తెలిపారు.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story