వైఎస్ షర్మిల ఫిర్యాదు.. నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై కేసులు

by srinivas |   ( Updated:2024-02-25 17:26:28.0  )
వైఎస్ షర్మిల ఫిర్యాదు.. నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ పోస్టులకు సంబంధించిన పీడీఎఫ్‌లను సైతం పోలీసులకు ఆమె అందజేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతుననారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు, పెడుతూ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ షర్మిల ఫిర్యాదు పత్రాన్ని పోలీసులకు బ్రదర్ అనిల్ కుమార్ అందజేశారు. ఈ మేరకు నటి శ్రీరెడ్డితోపాటు వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేశ్ బలగాకుల, ఆదిత్య సత్యకుమార్ దాసరి, సేనాని, మహ్మద్ రెహ్మత్ పాషాపై షర్మిల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

ఎన్నికల సిత్రాలు! ఆటో డైవర్‌గా మారిన మంత్రి!

Advertisement

Next Story