నాటునాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడం సంతోషం : Pawan Kalyan

by samatah |   ( Updated:2023-01-11 08:57:58.0  )
Producers to be troubled due to pawan kalyan statewide tour decision
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు..' గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం అని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన ఎంఎం కీరవాణికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది అని అన్నారు. 'నాటు నాటు' గీతాన్ని రచించిన చంద్రబోస్, ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు రాజమౌళి, చిత్ర కథానాయకులు రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్య అభినందనీయులు అని పవన్ కల్యాణ్ కొనియాడారు.

Also Read...

ఆ చెత్త సినిమాను షారుఖ్ ఎలా చేశాడో అర్థంకావట్లేదు: కేఆర్‌కే

Advertisement

Next Story