Rakhi Festival: అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు ‘రాఖీ’ పండుగ శుభాకాంక్షలు

by srinivas |   ( Updated:2024-08-19 06:45:37.0  )
Rakhi Festival: అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు ‘రాఖీ’ పండుగ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: రాఖీ పండుగ సందర్భంగా తెలుగు అడపచులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమేనని గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ... ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


Advertisement

Next Story