- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!
దిశ, వెబ్ డెస్క్ : మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజవోమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామంలో జరిగిన అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. గ్రామ శివారులో ప్రవహిస్తున్న మడేరు వాగుకి ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. వాగు వైపు వెళ్తున్న అజయ్ అనే యువకుడు ఇసుకలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు వెంటనే విగ్రహాన్ని గ్రామంలోని రామాలయానికి తీసుకెళ్లి పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టారు.
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇటీవల రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా జడ్డంగి గ్రామంలో రహదారి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అంజనేయ విగ్రహం లేదన్న బాధతో ఉన్న ఊరి జనానికి నేనున్నానన్నట్లుగా ఆ ఆంజనేయుడే బంగారు వర్ణం విగ్రహ రూపంలో మళ్లీ గ్రామానికి వచ్చాడని, మమ్మల్ని ఆ స్వామి వారు అనుగ్రహించారంటూ సంబరపడుతున్నారు. మా ఊరికి ఆ ఆంజనేయుడే మళ్ళీ వచ్చాడని విగ్రహంతో సెల్ఫీలు దిగి సోషలో మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మా కోసం మళ్ళీ మా ఊరికొచ్చిన హనుమాన్ కు త్వరలోనే గ్రామ పెద్దల సహకారంతో గుడి కట్టి విగ్రహా ప్రతిష్ట చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.