కాసేపట్లో సీఎం జగన్‌తో వైఎస్ షర్మిల భేటీ

by srinivas |
కాసేపట్లో సీఎం జగన్‌తో వైఎస్ షర్మిల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: వైస్సాఆర్టీపీ చీఫ్ షర్మిల కాసేపట్లో ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి షర్మిల చేరుకోనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ జనవరి 18న అట్లూరి ప్రియతో జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో సోదరుడు జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేయనున్నారు. తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించనున్నారు. అనంతరం షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు.

కాగా చాల ా రోజులుగా సోదరుడు వైఎస్ జగన్‌ను షర్మిల కలవలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా విడివిడిగా పాల్గొన్నారు. తెలంగాణలో వైఎస్సార్ టీపీ స్థాపించినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని షర్మిల భేటీ కావడం ఇది తొలిసారి.

Advertisement

Next Story