- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chandrababu: పక్కా ప్రణాళికతోనే దాడి
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై చేయడంతోపాటు బీజేపీ కార్యకర్తలపైనా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి అని ఆరోపించారు. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానుల శిబిరం సమీపంలో సత్యకుమార్ వాహనంపై దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్నారు. శిబిరంకు ఎంపీ నందిగం సురేశ్ మద్దతు తెలిపేందుకు వచ్చారు. అదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ అటుగా వెళ్తుండగా ఆయన కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టారు. సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సైతం కారు దిగి ప్రతిఘటించారు. దీంతో వైసీపీ, బీజేపీ నేతలు కొట్టుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో సత్యకుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నా. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదు? pic.twitter.com/oRJVfkZDbE
— N Chandrababu Naidu (@ncbn) March 31, 2023ఇవి కూడా చదవండి: Amaravatiలో బీజేపీ కార్యకర్తలపై దాడి.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..