- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని సభ అంటే అంతా ఆశామాషీనా.. కొట్టొచ్చినట్లు కనిపించిన భద్రతా లోపం
దిశ ప్రతినిధి,గుంటూరు:భారతదేశంలో రాజ్యాంగ పరంగా ప్రధాన మంత్రి పవర్ఫుల్. ఐతే ఏపీ లో కొందరు అధికారులకు ప్రధాని ఐతే ఏంటి అనే లెక్క లేని తనం ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.ఆదివారం బొప్పూడి వద్ద జరిగిన ప్రజా గళం సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.ఈ సభ లో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.సభాస్థలి లో టవర్స్ ఏర్పాటు చేశారు.ఆ టవర్స్ పై ప్రజలు ఎక్కి కూర్చున్నారు. ఇది గమనించిన మోడీ ప్రజలు కింద పడతారు అని ఆందోళన తో జనం టవర్స్ ఎక్కుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదేం అని చంద్రబాబు ను అడగడంతో పనితీరు గురించి మోడీ కి వివరించినట్లు తెలిసింది.దీంతో ఆయనే దిగ్గున లేచి సభ లో ముందు కు వచ్చి దిగండి..దిగండి నీ స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఐనా పోలీసు ల్లో చలనం లేదు. మోడీ కి రాష్ట్రంలో పోలీస్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకున్నారని ఆగ్రహం తో ఉన్నారని వేదికపైన ఉన్న 3 పార్టీల నాయ కులు కొందరు చెపుతున్నారు.
టవర్స్ పై జనం ఎక్కడం వల్ల మైకులకు అంతరాయం కలిగింది.కానీ పోలీసులు టవర్ ఎక్కిన వారిని దించే ప్రయత్నం చేయలేదు.ఆలాగే పాస్ లు ఇచ్చే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదంతా లెక్క లేని తనం తో జిల్లా ఎస్ పి రవిశంకర్ రెడ్డి చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ధ్వజం ఎత్తారు.అలాగే 5వ నెంబరు జాతీయ రహదారి పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఐనది. పోలీసు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.దీనికి తోడు మోడీ ఉన్న సభ లో కరెంటు పోవటం అందరినీ నివ్వెర పరచింది.ఆ సమయంలో మోడీ కూడా సెల్ లైట్స్ అనగానే అక్కడ ఉన్న వారంతా సెల్ లైట్స్ వేశారు.
దాదాపు 11 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా లేకుండా మోడీ సభ లో గడిపారు.ఇలా చాలా విషయాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పల్నాడు ఎస్. పి. రవిశంకర్ రెడ్డి పై మండిపడ్తున్నారు.ఆయన ఈ జిల్లా ఎస్. పి గా వచ్చినప్పటి అధికార పార్టీ నేతలే పోలీస్ స్టేషన్ లో పాలన చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ల నేతలు చెప్పు కాస్తున్నారు.307 సెక్షన్ ను పే హక్కు గా మార్చుకొని అమాయక టీడీపీ కార్యకర్తలపై పెట్టీ వేధిస్తున్న ఎస్. పి. రవిశంకర్ రెడ్డి అని చెప్పారు.ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ పి రవిశంకర్ రెడ్డి ప్రధాని సభ లో లోపాలకు బాధ్యుడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Read More..
BREAKING:ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర..అక్కడి నుంచే ప్రారంభం