Tenali: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఘోరం

by srinivas |
Tenali: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఘోరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా బాలికపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలి పట్టణానికి చెందిన కొప్పులరాజు 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పేవాడు. అయితే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు బాలిక తెలియజేసింది. దీంతో బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కొప్పుల రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story