- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్‌తోపాటు వాలంటీర్ల కొనసాగింపు, భూ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తున్నారు. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల్లో నిబంధనలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనపైనా చర్చిస్తున్నారు. రామాయపట్నం పోర్టుతో పాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. అన్న క్యాంటీన్లు సహా పలు సంక్షేమపథకాల అమలుతో పాటు 217 జీవో రద్దు, నూతన మద్యం పాలసీ, వైసీపీ చేపట్టిన భూముల రీసర్వే, ప్రభుత్వం రంగ సంస్థలు, ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ వంటి అంశాలపైనా మంత్రులతో చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు.