Breaking: నారా లోకేశ్ ఊరట.. సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2023-09-29 10:09:50.0  )
Breaking: నారా లోకేశ్ ఊరట.. సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ జరిగింది. అక్టోబర్ 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేశ్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరువర్గాల వాదన విని కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Advertisement

Next Story