- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు ఊరట
- భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు
- వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు
- ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పయ్యావులకు తగిన భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తనకు భద్రత సిబ్బందిని తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పయ్యావుల కేశవ్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఐదు, ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. వారిలో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.
ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
గతంలో విచారణకు వచ్చిన సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే నేటి వరకూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ నిర్ణయంపట్ల ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్‌కు నమ్మకం ఉండాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణ విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడంపై తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.