- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో జగనన్న దోపిడీ పథకం: పట్టాభి
దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయినవారందరికీ దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి త్వరలో జగనన్న దోపిడీ పథకానికి తెరలేపబోతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రజల సొమ్ము దోచి పెట్టేందుకు జగన్ రెడ్డి సిద్ధమయ్యాడన్నారు. పనులు చేసినా..చేయక పోయినా మెగా ఇంజనీరింగ్, పుంగనూరు పుడింగి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పీఎల్ఆర్ లాంటి వాటికి దోచిపెట్టేందుకు ఏకంగా ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ దోపిడీ గ్యారెంటీ స్కీమ్‌కు ముఖ్యమంత్రి తెరలేపాడని దుయ్యబట్టారు. ఇప్పటికే పోలవరం పనుల కాంట్రాక్టు పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థకు దోచిపెట్టడానికి జగన్ రెడ్డి సర్కార్ ఏకంగా 7 గ్యారెంటీ లెటర్స్ ఇచ్చేసిందన్నారు. ఏ నిబంధనల ప్రకారం మెగా ఇంజనీరింగ్ సంస్థకు 7 గ్యారెంటీ లెటర్లు ఇచ్చారో చెప్పాలని జగన్‌ను నిలదీశారు. మే 8-2024న రూ.56 కోట్లు, మే-15-2024న మరో రూ.34 కోట్లకు, అదే రోజున మరో రూ.66 కోట్లకు, మే 22, 2024న రూ.30,31,34,738లకు గ్యారెంటీ లెటర్లు ఇచ్చారన్నారు.
అలాగే మే 29న రూ.31కోట్లకు, ఆగస్టు 28, 2024న మరో రూ.35 కోట్లకు లెటర్స్ ఇచ్చారని, వీటితో పాటు రూ.255 కోట్ల చెల్లింపునకు సంబంధించి జగన్ రెడ్డి గ్యారెంటీ లెటర్స్ ఇచ్చారన్నారు. ఈ లెటర్స్ తీసుకొని మెగా ఇంజనీరింగ్ సంస్థ నేరుగా రుణాలివ్వాలని కోరుతూ కెనరా బ్యాంకును సంప్రదించారని, పైకి కనిపిస్తున్నవి ఈ 7 లెటర్సేనని, ఇంకా తెలియకుండా ఎన్ని ఇచ్చారో తెలియదన్నారు. ఈ విధంగా ప్రభుత్వ డబ్బులు తీసుకుంటున్న మెగా సంస్థ పోలవరం పనులు చేస్తుందా అంటే అదేమీ లేదని, నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో పోలవరం పనులు 4 శాతం కూడా పూర్తి కాలేదంటే ఈ ప్రభుత్వం నిర్మాణ పనుల కాంట్రాక్టు పొందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎంత బాగా పనులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.