సాగునీటి సమస్యపై 18న నిరసన: కన్నా లక్ష్మీనారాయణ

by srinivas |
సాగునీటి సమస్యపై 18న నిరసన: కన్నా లక్ష్మీనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ రైతు సమస్యలపై దృష్టి సారించారు. అలాగే వాటి పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న సాగు నీటి సమస్యపై రైతులతో కలిసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న నర్సరావుపేటలో ధర్నా చేపట్టేందుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. నీగు నీటి కోసం పోరాటం చేసిన రైతులను అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. ప్యాలెస్ వదిలి బయటకు వస్తే సమస్యలు తెలుస్తాయని ధ్వజమెత్తారు. వై నాట్ 175 అంటున్న సీఎం జగన్‌ను జనం నమ్మడం లేదని కన్నా లక్ష్మీనారయణ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story