Graduate Elections: పట్టభద్రులు కర్రకాల్చి వాతపెట్టారు

by srinivas |   ( Updated:2023-03-17 16:14:58.0  )
Graduate Elections: పట్టభద్రులు కర్రకాల్చి వాతపెట్టారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్‌కి కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని ఎద్దేవా చేశారు. వెలగపూడిలో శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజల తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్‌కు ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా పట్టభద్రులు టీడీపీవైపే నిలబడ్డారని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అంటూ ఉత్తరాంధ్రప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని, అయితే ఆ మోసాన్ని ప్రజలు ముఖ్యంగా పట్టభద్రులు పసిగట్టారని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా అనే భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ప్రచారం చేశారని చెప్పారు. అభివృద్ధే తమ నినాదం అని ఉత్తరాంధ్ర పట్టభద్రులు చాటి చెప్పారన్నారు.

విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను వైసీపీ కొల్లగొట్టిందని, అదే ఎన్నికల ప్రచారంలో ప్రతీ పట్టభద్రుడికి ఆధారాలతో సహా చూపించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అందుకే పట్టభద్రులు తమపై నమ్మకం ఉంచి ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపొందుతామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అత్మప్రభోదానుసారం ఓటేయబోతున్నారన్నారు. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే జోష్‌తో 2024 ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలు పొందుతామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Go Back Cm Jagan sir.. విశాఖలో ఒక్కసారిగా కలకలం

Advertisement

Next Story

Most Viewed